ఇనుగుర్తి, మార్చి 14 : నకిలీ విత్తనాలతో మక్క పంట నేలవాలి రైతులు నష్టపోయిన ఉదంతం మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం తారాసింగ్ తండా జీపీ పరిధి రామ్‌లాల్ తండాలో వెలుగు చూసింది. తండాకు చెందిన ముగ్గురు రైతులు మూడు నెలల క్రితం వరంగల్‌లోని అమూల్య ఆగ్రోస్ ట్రేడర్స్ వద్ద మక్కవిత్తనాలు కొనుగోలు చేసి 4 ఎకరాల్లో సాగు చేశారు.
పంట చేతికొచ్చే దశలో చేను నేలవాలింది. గాలి.వానలు లేకున్నా నకిలీ విత్తనాలతోనే పంట దెబ్బతిన్నదని బాధిత రైతులు ఆవేదన చెందారు. దీనికి కారణమైన షాప్ యాజమాన్యంపై కేసు పెడతామని తెలిపారు. నకిలీ విత్తనాలు విక్రయించిన షాపు నుంచి తమకు పరిహారం అందించాలని అధికారులను కోరారు.