జోగులాంబ గద్వాల : జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలోని రాజోలి మండలం పెద్ద ధన్వాడ గ్రామంలో ఇథనాల్ ఫ్యాక్టరీ(Ethanol factory) అనుమతులు రద్దు చేయాలంటూ రైతులు గురువారం మొదటి రోజు రిలే నిరాహార దీక్షలు(Farmers Relay hunger strike) ప్రారంభించారు. పెద్ద ధన్వాడ గ్రామ రైతులకు మద్దతు తెలుపుతూ వివిధ గ్రామాల నుంచి ప్రజలు రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. కొంతమంది వ్యక్తులు తమ నుంచి వ్యవసాయ కోసమని భూములు కొనుగోలు చేసి వాటిని కంపెనీకి కట్టబెడుతున్నారని మండిపడ్డారు. అప్పుడే తమకు నిజం చెప్పి ఉంటే ఆ భూములను అమ్మేటోళ్లం కాదని అన్నారు. వెంటనే ప్రభుత్వం ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు ఆలోచనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి..
Mahabubabad | ఇందిరమ్మ పథకం, ఈ పథకం, ఆ పథకం, బొంగు భోషాణం.. అధికారులపై మహిళ ఫైర్
Congress | ఇందిరమ్మ రాజ్యంలో మృత్యు ఘోష.. ప్రజల ప్రాణాలు తీస్తున్న కాంగ్రెస్ పథకాలు
Mulugu | ఇందిరమ్మ ఇల్లు రాలేదని పురుగుల మందు తాగిన వ్యక్తి.. హాస్పిటల్కు తరలింపు