నిజామాబాద్: ధాన్యం సేకరణలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా తెలంగాణ రైతాంగం పోరుబాటపట్టింది. టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ పిలుపుమేరకు సోమవారం ఉదయం నుంచి ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గ్రామగ్రామాన నిరసనలు హోరెత్తుతున్నాయి. కేంద్రంలోని బీజేపీ సర్కార్ దిష్టిబొమ్మను రైతులు దగ్ధం చేశారు. రైతులకు మద్దతుగా టీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు.
తెలంగాణ ప్రభుత్వం నుంచి బియ్యాన్ని కేంద్రమే సేకరించాలని డిమాండ్ చేశారు. రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తూ.. రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్న కేంద్ర ప్రభుత్వం తక్షణం గద్దె దిగాలని రైతులు శాపనార్థాలు పెట్టారు.