శివ్వంపేట, ఆగస్టు 28 : గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలను సైతం రైతులు లెక్క చేయకుండా యూరియా కోసం పడరాని పాట్లు పడుతున్నారు. గురువారం మెదక్ జిల్లా శివ్వంపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పీఏసీఎస్) వద్ద ఉదయం నుంచి నుంచి చెప్పులు, ఇటుకలు క్యూలో పెట్టి పడిగాపులు పడుతున్నారు.
మరోవైపు శివ్వంపేట రైతువేదిక వద్ద యూరియా ఇస్తున్నారని తెలియడంతో టోకెన్ ఉన్న రైతులు వర్షంలో తడుస్తూ క్యూ కట్టి యూరియా కోసం వేచి చూశారు. రైతులు క్యూ ఎక్కువ కావడంతో ఒకరినొకరు తోసుకుంటుండడంతో విషయం తెలుసుకున్న పోలీసులు రైతు వేదిక వద్దకు చేరుకొని రైతులను సముదాయించారు.