ఆదిలాబాద్: రాష్ట్రంలో అన్నదాతలకు యూరియా (Urea) కోసం తిప్పలు తప్పడం లేదు. ఓవైపు వర్షాలు పడుతున్నా రైతులు లైన్లలో నిల్చుంటున్నారు. తాజాగా ఆదిలాబాద్లో (Adilabad) అగ్రికల్చర్ కో-ఆపరేటివ్ సొసైటీ ముందు యూరియా కోసం రైతులు బారులు తీరుతున్నారు. జిల్లాలో రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నడంతో రైతులు ఎరువుల కోసం విక్రయ కేంద్రాల వద్దకు పరుగులు తీస్తున్నారు.. గురువారం ఉదయం ఆదిలాబాద్ సొసైటీకి భారీ సంఖ్యలో రైతులు ఎరువుల కోసం వచ్చారు. 440 యూరియా సంచులు మాత్రమే పంపిణీ చేసిన అధికారులు మిగతా రైతులు మిగతా రైతులను ప్రైవేటు డీలర్ల వద్దకొనుగోలు చేయాలని సూచించారు. దీంతో రైతులు ప్రైవేట్ దుకాణం డీలర్ల వద్ద వెళ్లి కొనుగోలు చేశారు.
Urea
రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కోసం రైతులు ఆందోళన చెందుతున్నారు. యూరియా కొరతను నివారించాలని డిమాండ్ చేస్తూ రోడ్డెక్కుతున్నారు. బుధవారం కురిసిన వర్షంలోనూ రైతులు పలుచోట్ల బారులుతీరారు. మంచిర్యాల కోటపల్లి మండల కేంద్రంలో యూరియా కోసం రైతులు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా క్యూకట్టారు. కోటపల్లిలోని పీఏసీఎస్లోని యూనియా పంపిణీ కేంద్రానికి రైతులు బుధవారం ఉదయమే చేరుకున్నారు. వర్షంలో తడుస్తూ పడిగాపులు కాశారు. ఎకరానికి ఒక్క బస్తా మాత్రమే ఇవ్వడంతో రైతులు నిరాశకు గురయ్యారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ ఏజెన్సీలోని పొగుళ్లపల్లి సొసైటీ వద్ద వర్షాన్ని సైతం లెక్క చేయకుండా రైతులు గొడుగులు పట్టుకొని, కవర్లు వేసుకొని క్యూలో నిలబడ్డారు.