నర్సింహులపేట, ఫిబ్రవరి 15: యూరియా కోసం రైతులు నానా తంటాలు పడుతున్నారు. వరి, మక్కజొన్న, మిరప పంట లు సాగు చేసిన నేపథ్యంలో రైతుల అవసరాల మేరకు యూరియా లేకపోవడంతో మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలోని సొసైటీ కార్యాలయం వద్ద శనివారం ఉదయం బారులుతీరారు.
లారీ లోడ్ యూరియా రావడంతో వివిధ గ్రామాల నుంచి పెద్ద ఎత్తున వచ్చిన రైతులు క్యూలైన్లో నిల్చున్నారు. మరోవైపు ఇదే అదునుగా భావించిన ప్రైవేట్ వ్యాపారులు ఎక్కువ ధరకు యూరియా విక్రయిస్తుండటంతో రైతులకు భారంగా మారింది.