సైదాపూర్, అక్టోబర్ 24 : గత సీజన్లో ప్రభుత్వం కొనుగోలు చేసిన సన్న వడ్లకు బోనస్ ఎప్పుడిస్తారని రైతులు కరీంనగర్ అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్ను ప్రశ్నించారు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం రాయికల్, బొమ్మకల్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేందుకు అదనపు కలెక్టర్‌తోపాటు పలువురు అధికారులు వచ్చారు.
ఈ సందర్భంగా రైతులు సన్నాలకు బోనస్‌పై నిలదీశారు. గతంలో కొన్న సన్న వడ్లకు బోనస్ క్వింటాల్‌కు రూ.500 ఇంత వరకు ఇవ్వకపోగా మళ్లీ ఇస్తామని ప్రచారం చేయడం ఏంటని ప్రశ్నించారు. ఐదు నెలలు గడిచినా బోనస్ ఇవ్వకుండా రైతులను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ గత సీజన్లో సన్న వడ్ల బోనస్‌ను ఈ సీజన్‌తో కలిపి ఇస్తామని తెలిపారు.