కుత్బుల్లాపూర్, జూలై 3: రైతులు ధాన్యం అమ్మగా.. సకాలంలో డబ్బులు ఇవ్వకపోవడంతో గురువారం దూలపల్లి నూజివీడు సీడ్స్ కంపెనీ ఎదుట మెదక్ జిల్లా చిన్నశంకరంపేట్ మండలం గౌడవెల్లి గ్రామానికి చెం దిన రైతులు ఆందోళన చేపట్టారు.
ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. ఆడ, మగ రకాల వరి ధాన్యాన్ని సేకరించిన కంపెనీ ఏజెంట్ ద్వారా తమకు డబ్బులు రావాలని, నెలల తరబడి డబ్బులు ఇవ్వకపోవడంతోపాటు, నిర్లక్ష్యంగా సమాధానం చెబు తుండటంతో ఆందోళన చేపట్టినట్టు తెలిపారు. కంపెనీ యాజమాన్యం ఏజెంట్‌తో సంప్రదింపులు జరుపు తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.