హైదరాబాద్ : ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఆందోళన బాటపడుతున్నారు. తాజాగా వరంగల్ జిల్లా వర్దన్నపేట మండలం ఇల్లందలోని అంబేద్కర్ సెంటర్ వద్ద ధర్నాకు దిగారు. మార్కెట్లో వడ్లు పోసి వారం రోజులైనా కొనుగోలు చేయడం లేదని ఆరోపించారు. స్థానిక కాంగ్రెస్ నాయకులు రైతులను బీఆర్ఎస్ రైతులు, బీజేపీ రైతులు, కాంగ్రెస్ రైతులు అని విభజించి ఇబ్బందులకు గురి చేస్తున్నారంటు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంటాలు ప్రారంభిచాలని కలెక్టర్ చెప్పినా అధికారులు వినడంలేదని ఆందోళన వ్యక్తం చేశారు. దేశానికి అన్నం పెట్టే రైతులు పంట కొనమని కాళ్లు మొక్కాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. వడ్ల కొనుగోలు ప్రారంభించే వరకు ధర్నా విరమించేదని స్పష్టం చేశారు.
వరంగల్ జిల్లా వర్దన్నపేట మండలంలో రైతుల ధర్నా
మార్కెట్లో వడ్లు పోసి వారం రోజులైనా కొనుగోలు చేయడం లేదని ఇల్లంద అంబేద్కర్ సెంటర్ వద్ద ధర్నాకు దిగిన రైతులు
స్థానిక కాంగ్రెస్ నాయకులు రైతులను బీఆర్ఎస్ రైతులు, బీజేపీ రైతులు, కాంగ్రెస్ రైతులు అని విభజించి ఇబ్బందులకు గురి… pic.twitter.com/itlaBMkIm3
— Telugu Scribe (@TeluguScribe) May 7, 2026