కథలాపూర్లో నీళ్ల కోసం రైతుల ధర్నా
వరద కాలువలోకి నీటిని వదలాలని డిమాండ్ చేస్తూ జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలంలోని బొమ్మెన, తక్కళ్లపెల్లి, భీమారం మండలం మన్నెగూడెం గ్రామాల రైతులు శనివారం కథలాపూర్ శివారులోని వరద కాలువ బ్రిడ్జిపై ధర్నా చేశారు.
- నీటిని వదులుతామని విప్ ఆది శ్రీనివాస్ హామీ
- ససేమిరా అన్న రైతులు
- వెంటనే విడుదల చేసిన అధికారులు
కథలాపూర్, మార్చి 30 : వరద కాలువలోకి నీటిని వదలాలని డిమాండ్ చేస్తూ జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలంలోని బొమ్మెన, తక్కళ్లపెల్లి, భీమారం మండలం మన్నెగూడెం గ్రామాల రైతులు శనివారం కథలాపూర్ శివారులోని వరద కాలువ బ్రిడ్జిపై ధర్నా చేశారు. వరదకాలువలో నీళ్లు లేకపోవడంతో చేతికందే వరి పంట ఎండిపోతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు విన్నివించుకున్నా ఫలితం లేదని ఆవేదన చెందారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వరదకాలువ నిండా నీటితో కళకళలాడి పంటలు పుష్కలంగా పండేవని తెలిపారు. ప్రస్తుతం వరద కాలువలో నీళ్లు లేకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని వాపోయారు.
రైతులు ధర్నా చేస్తున్న సమయంలో అటుగా వెళ్తున్న ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ వారి వద్దకు వచ్చి సమస్యను అడిగి తెలుసుకున్నారు. అధికారులతో మాట్లాడామని, వరదకాలువలోకి నీళ్లు వదిలినట్టు రైతులకు తెలిపారు. నీళ్లు కథలాపూర్ వరకు చేరితేనే ధర్నా విరమిస్తామని వారు భీష్మించారు. ఎస్సై నవీన్ కుమార్ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో మెట్పల్లి మండలం జగ్గసాగర్ గ్రామశివారులోని వరదకాలువకు గల గేట్ ద్వారా నీళ్లను వదిలారు. దీంతో రైతులు ధర్నాను విరమించారు. రైతులు గంటసేపు బైఠాయించడంతో కోరుట్ల – వేములవాడ రోడ్డుకు ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

