బీబీపేట్, ఏప్రిల్ 18: కరెంట్ సరఫరాలో అంతరాయం కారణంగా పం టలు ఎండిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తంచేస్తూ కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండలం జనగామ, సీతారాంపల్లి రైతులు సబ్స్టేషన్ ఎదుట బైఠాయించారు. రెండ్రోజులుగా అర్ధరాత్రి తర్వాత కరెంట్ ఇచ్చారని, ఆలస్యంగా కరెంట్ సరఫరా చేయడంతో పంటల కు సరిపడా నీరందడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని రైతులను సముదాయించి, ధర్నా విరమింపజేశారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కరెంట్ సరఫరా చేస్తామని ఏఈ విజయభాస్కర్ తెలిపారు.