మంత్రి శ్రీహరికి నిరసన సెగ
మంత్రి వాకిటి శ్రీహరికి రైతుల నుంచి నిరసన సెగ తగిలింది. మంగళవారం వనపర్తి జిల్లా అమరచింత మండలంలో రూ.6 కోట్లతో చేపట్టనున్న చంద్రఘడ్ ఎత్తిపోతల పథకం మరమ్మతులకు మంత్రి భూమిపూజ చేశారు.
అమరచింత, జూలై 7 : మంత్రి వాకిటి శ్రీహరికి రైతుల నుంచి నిరసన సెగ తగిలింది. మంగళవారం వనపర్తి జిల్లా అమరచింత మండలంలో రూ.6 కోట్లతో చేపట్టనున్న చంద్రఘడ్ ఎత్తిపోతల పథకం మరమ్మతులకు మంత్రి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతుండగా.. ఈర్లదిన్నెకు చెందిన రైతులు హన్మంతురెడ్డి, వెంకట్రెడ్డి హామీలపై నిలదీశారు. మక్తల్ ఎమ్మెల్యేగా గెలిపిస్తే నెలలోపు మండలంలోని అన్ని గ్రామాలకు బీటీ రోడ్లు వేయించడంతోపాటు భూత్పూర్ కెనాల్ నుంచి ఈర్లదిన్నె, మిట్టనందిమళ్ల గ్రామాల రైతులకు సాగునీరు అందిస్తానని హామీ ఇచ్చి రెండేండ్లు గడిచినా నెరవేరలేదని గుర్తుచేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు వారిని అక్కడి నుంచి తోసేయడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొన్నది. ఆత్మకూరు సీఐ శివకుమార్, అమరచింత ఎస్సై స్వాతి వారికి నచ్చజెప్పారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘అర్హులైన మహిళలందరికీ బతుకమ్మ చీరలు ఇవ్వాలి’
Congress councilors resign | మంత్రి జూపల్లి, ఎంపీ మల్లు రవి పోకడలకు నిరసనగా ఏడుగురు కాంగ్రెస్ కౌన్సిలర్ల రాజీనామా
Blue Drum Murder | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. నిందితులు ముస్కాన్, సాహిల్కు మరణశిక్ష
Mythri Movie Makers | నైజాంలో మైత్రీ మూవీ మేకర్స్ హవా.. దసరా బరిలో కీలక సినిమాల పంపిణీ బాధ్యతలు ఆ సంస్థకే!
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

