మా పంటకు గిట్టుబాటు ధరేది?
పంటకు గిట్టుబాటు ధర చెల్లించడం లేదంటూ రైతులు ఆందోళనకు దిగారు. క్వింటాకు రూ.వెయ్యికిపైగా తగ్గించి ఇస్తున్నారంటూ మిల్లర్లపై మండిపడ్డారు. ఈ మేరకు ఆదివారం వారు నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం యాద్గార్‌పల్లిలోని కోదాడ రోడ్డుపై ధర్నా నిర్వహించారు.
- క్వింటాకు రూ.వెయ్యి తగ్గిస్తరా?
- మిల్లర్ల తీరుపై రైతుల ఆగ్రహం
- యాద్గార్‌పల్లిలో రోడ్డుపై బైఠాయింపు
మిర్యాలగూడ, నవంబర్ 9 : పంటకు గిట్టుబాటు ధర చెల్లించడం లేదంటూ రైతులు ఆందోళనకు దిగారు. క్వింటాకు రూ.వెయ్యికిపైగా తగ్గించి ఇస్తున్నారంటూ మిల్లర్లపై మండిపడ్డారు. ఈ మేరకు ఆదివారం వారు నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం యాద్గార్‌పల్లిలోని కోదాడ రోడ్డుపై ధర్నా నిర్వహించారు. 25 రోజులుగా క్వింటాకు రూ.4వేల నుంచి రూ.4,500 వరకు సన్న ధాన్యాన్ని కొనుగోలు చేశారు. దీపావళి పండుగ రోజు రూ.2,800 నుంచి రూ.3,200 వరకు మాత్రమే కొనుగోలు చేపట్టారు. దీంతో రైతులు యాద్గార్‌పల్లిలోని కోదాడ రోడ్డుపై ధాన్యం లోడ్ ట్రాక్టర్లు అడ్డుగా నిలిపి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. మిల్లర్లు సిండికేట్‌గా మారి దోచుకుంటున్నారని మండిపడ్డారు.
బహిరంగ మారెట్లో బియ్యం ధరలు క్వింటాకు రూ.8,500కు పైగా అమ్ముతున్నారని ఈ ధర ప్రకారం రైతులకు క్వింటా ధాన్యానికి రూ.5 వేలకు పైగా చెల్లించాలని డిమాండ్ చేశారు. మిర్యాలగూడ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గౌరు శ్రీనివాస్ అక్కడికి వచ్చి నాణ్యమైన ధాన్యానికి క్వింటా రూ.3,500లకు కొనుగోలు చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నా విరమించారు. అదేవిధంగా సోమవారం పలు రైస్ మిల్లుల్లో నాణ్యమైన సన్న ధాన్యాన్ని రూ.2,800 నుంచి రూ.3,200 వరకు మాత్రమే కొనుగోలు చేశారు. క్వింటాకు వెయ్యి రూపాయలకుపైగా ధర తగ్గించారని వ్యాపారులను ప్రశ్నిస్తే దురుసుగా మాట్లాడుతూ బెదిరిస్తున్నారని రైతులు ఆవేదన చెందుతున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

