అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
పంట దిగుబడులు రాక, అప్పులు తీర్చే మార్గం లేక మనస్తాపం చెందిన ఓ కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం పారువెల్లలో చోటుచేసుకున్నది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం..
- దిగుబడులు రాక మనస్తాపం
- కరీంనగర్ జిల్లా పారువెల్లలో విషాదం
గన్నేరువరం, నవంబర్ 9 : పంట దిగుబడులు రాక, అప్పులు తీర్చే మార్గం లేక మనస్తాపం చెందిన ఓ కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం పారువెల్లలో చోటుచేసుకున్నది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. పారువెల్లకు చెందిన గంగు రాజయ్య (50) తనకున్న మూడెకరాల భూమితోపాటు మరో 12 ఎకరాలు కౌలుకు తీసుకుని వరి, పత్తి, మక పంటలు సాగు చేశాడు. పెట్టుబడులతోపాటు ట్రాక్టర్ కొనుగోలు కోసం సుమారు రూ.8 లక్షల వరకు అప్పు చేశాడు.
ఈ ఏడాది వేసిన పంటల్లో సరైన దిగుబడులు రాకపోవడంతో తీవ్ర నష్టం వాటిల్లింది. అప్పులు ఎలా తీర్చాలో తెలియక తీవ్ర మనస్తాపం చెందాడు. ఈ క్రమంలో ఈ నెల 7న రాజయ్య తన పొలం వద్ద పురుగుల మందు తాగి పడిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు ఆయన్ను కరీంనగర్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. పరిస్థితి విషమించడంతో సోమవారం మృతి చెందాడు. రాజయ్యకు భార్య రాజవ్వ, కూతురు, కొడుకు ఉన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

