కరెంట్ షాక్‌తో రైతు మృతి.. వనపర్తి జిల్లాలో విషాదం
విద్యుదాఘాతంతో రైతు మృతి చెందిన ఘటన వనపర్తి జిల్లాలో చోటుచేసుకున్నది. ఎస్సై కుర్మయ్య తెలిపిన వివరాల ప్రకారం..
పాన్‌గల్, నవంబర్ 9 : విద్యుదాఘాతంతో రైతు మృతి చెందిన ఘటన వనపర్తి జిల్లాలో చోటుచేసుకున్నది. ఎస్సై కుర్మయ్య తెలిపిన వివరాల ప్రకారం.. పాన్‌గల్ మండలం అన్నారం గ్రామానికి చెందిన గడ్డం పెద్ద గట్టయ్య (60) తనకున్న రెండెకరాల పొలంతోపాటు మూడేండ్లుగా వెంగళాయపల్లిలో 2.25 ఎకరాలు కౌలుకు తీసుకొని వరి సాగు చేస్తున్నాడు.
ఆదివారం ఉదయం పొలం వద్దకు వెళ్లిన గట్టయ్య సాయంత్రమైనా ఇంటికి తిరిగి రాకపోవడంతో అతడి కుమారుడు మద్దిలేటి, గ్రామస్తులు బాలపీరు, నరేశ్ కలిసి పొలం వద్దకు వెళ్లి చూడగా.. మోటర్ వద్ద విగతజీవిగా కనిపించాడు. విద్యుత్తు మోటర్ వైర్ ఇన్సులేషన్ దెబ్బదినగా.. టేపు చుట్టే క్రమంలో విద్యుత్తు షాక్ తగిలి మృతి చెందినట్టు గుర్తించారు. కేసు నమోదుచేసి,దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

