అలంపూర్ చౌరస్తా, డిసెంబర్ 4: జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ చౌరస్తాలోని వ్యవసాయ మార్కెట్ యార్డు గేటుకు రైతులు గురువారం తాళం వేశారు. 15 రోజుల కిందట మార్కెట్లో ప్రారంభించిన కొనుగోలు కేంద్రానికి మక్కలు తీసుకొస్తే నామమాత్రంగా కొంటున్నారని ఆగ్రహం చెందారు. నిద్రాహారాలు మానుకొని కేంద్రాల వద్ద జాగారం చేయాల్సి వస్తున్నదని వాపోయారు.
కేంద్రాల్లో తేమ పరిశీలించి కొన్నాక గోదాముకు తరలిస్తే అక్కడ గుమస్తా తేమ శాతం తక్కువగా ఉందంటూ వేధింపులకు గురిచేస్తున్నారని, డబ్బులు ఇస్తే తేమను పరిశీలించకుండానే లారీల్లో లోడ్ చేయిస్తున్నారని ఆరోపించారు. విష యం తెలుసుకొన్న ఎస్సై శేఖర్ మార్కెట్ వద్దకు వెళ్లి ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేయడంతో శాంతించారు.