బోనకల్లు, జనవరి 9 : యూరియా కోసం రైతులు కష్టాలు పడుతూనే ఉన్నారు. పంట అదునుకు యూరియా వేయకపోతే దిగుబడులపై ప్రభావం చూపుతుందనే ఉద్దేశంతో చలిలోనే తెల్లవారుజామున సొసైటీల వద్ద ఉరుకులు పరుగులు పెడుతున్నారు.
ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం రావినూతల సొసైటీ కార్యాలయం వద్ద రైతులు యూరియా కోసం శుక్రవారం తెల్లవారుజామున చేరుకొని క్యూలో నిల్చున్నారు. ఒక్కలోడు మాత్రమే రావడంతో సొసైటీ అధికారులు కూపన్ల ఆధారంగా 70 మంది రైతులకు మాత్రమే యూరియా పంపిణీ చేశారు. మిగిలిన రైతులు ఇంటిబాట పట్టారు.