తిమ్మాపూర్/ చిగురుమామిడి/ వీణవం క/ కరీంనగర్‌రూరల్/లోకేశ్వరం, ఫిబ్రవరి 22 : యూరియా కోసం ఉదయం నుంచే సహకార సంఘాల గోదాములు, రైతు సేవా కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు. శనివారం కరీంనగర్ జిల్లా వీణవంక మండలం చల్లూరులోని ఆగ్రోస్ రైతు సేవాకేంద్రానికి 230 బస్తాలే రావడంతో రైతులు వాటి కోసం ఎగబడ్డారు.
ఇందుర్తిలో రైతులు చెప్పులను వరుస క్రమంలో ఉంచారు. రేకొండలో గంటల తరబడి వేచి చూశారు. కరీంనగర్ మండలం దుర్శేడ్‌లో రైతులు బారులు తీరి నిల్చున్నారు. తిమ్మాపూర్ మండలంలోని గ్రామాల్లో రైతులు అవస్థలు పడ్డారు. నిర్మల్ జిల్లా మన్మథ్ పీఏసీఎస్‌కు 1650 బస్తాలు రావాల్సి ఉండగా.. 450 మాత్రమే వచ్చాయి. దీంతో అధికారులు ఒక్కొక్కరికి ఐదు బస్తాలు మాత్రమే పంపిణీ చేశారు.