Hyderabad | హైదరాబాద్లో దారుణం జరిగింది. కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ప్రైవేటు కంపెనీ కార్యాలయంపై నుంచి దూకి ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. చిత్తూరు జిల్లా మద్దినాయనిపల్లి గ్రామానికి చెందిన అనిత (23) హైదరాబాద్లో నివసిస్తూ ప్రైవేటు కంపెనీలో జాబ్ చేస్తోంది. గురువారం మధ్యాహ్నం తాను పనిచేసే సీబీసీఐడీ కాలనీలోని కంపెనీ కార్యాలయం భవనం మూడో అంతస్తు నుంచి కిందకు దూకింది. ఈ ప్రమాదంలో అనిత తీవ్రంగా గాయపడింది. రక్తపు ముడుగులో పడివున్న అనితను గమనించిన అక్కడి వారు.. తక్షణమే నిజాంపేటలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.
ఎమర్జెనీ వార్డులో చికిత్స పొందుతున్న సమయంలోనే పరిస్థితి విషమించడంతో అనిత మరణించింది. కాగా, గత కొంతకాలంగా అనిత అనారోగ్య సమస్యలతో సతమతమవుతోందని, వాటితోనే మానసిక ఒత్తిడికి లోనై ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో అనిత తల్లి పేర్కొన్నారు.