TheDinosaurs | ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్ (Netflix) డైనోసార్ల మీద డాక్యుమెంటరీ సిరీస్‌ను తీసుకువస్తుంది. ‘ద డైనోసార్స్’ (THE DINOSAURS) అంటూ ఈ డాక్యుమెంటరీ సిరీస్ రాబోతుండగా.. మార్చి 06 నుంచి స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ సందర్భంగా ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రయూనిట్. ఈ ట్రైలర్‌కు హాలీవుడ్ లెజెండరీ నటుడు మోర్గాన్ ఫ్రీమాన్ వాయిస్ ఓవర్‌ను అందించగా.. ప్రపంచ ప్రఖ్యాత దర్శకుడు స్టీవెన్ స్పిల్బర్గ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ సిరీస్‌కు స్టార్ వార్స్, జురాసిక్ పార్క్ వంటి సినిమాలకు పనిచేసిన ప్రముఖ విజువల్ ఎఫెక్ట్స్ కంపెనీ ILM (Industrial Light & Magic) గ్రాఫీక్స్ అందిస్తుంది.
ఈ ట్రైలర్ చూస్తుంటే.. ట్రైలర్లో కనిపించే దృశ్యాలు అత్యంత రియలిస్టిక్‌గా ఉండటమే కాకుండా డైనోసార్ల ఆవిర్భావం, వాటి పరిణామ క్రమం మరియు అవి ఎలా అంతరించిపోయాయి అనే అంశాలను ఇందులో అద్భుతంగా చూపించబోతున్నారు. మొత్తం నాలుగు ఎపిసోడ్లుగా రానున్న ఈ డాక్యుమెంటరీ సిరీస్ మార్చి 6, 2026 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.