Anaganaga Oka Raju OTT | ఓటీటీలో సందడికి సిద్ధమైన మరో సంక్రాంతి మూవీ.. ఎందులో స్ట్రీమింగ్ కానుంది అంటే..!
Anaganaga Oka Raju OTT | టాలీవుడ్ టాలెంటెడ్ హీరో నవీన్ పోలిశెట్టి ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం ‘అనగనగా ఒక రాజు’ థియేటర్లలో మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. దర్శకుడు మారి తెరకెక్కించిన ఈ చిత్రంలో లేటెస్ట్ బ్యూటీ మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటించగా, అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్గా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.
Anaganaga Oka Raju OTT | టాలీవుడ్ టాలెంటెడ్ హీరో నవీన్ పోలిశెట్టి ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా చిత్రం ‘అనగనగా ఒక రాజు’ థియేటర్లలో మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. దర్శకుడు మారి తెరకెక్కించిన ఈ చిత్రంలో లేటెస్ట్ బ్యూటీ మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటించగా, అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్గా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. నవీన్ పోలిశెట్టి టైమింగ్ కామెడీ, వినోదభరితమైన డైలాగ్స్, కుటుంబ ప్రేక్షకులను అలరించే సన్నివేశాలు ఈ సినిమాకు ప్రధాన బలాలుగా నిలిచాయి.సంక్రాంతి పండుగ సెలవులు కావడంతో ఈ సినిమాకు థియేటర్లలో మంచి ఆడియన్స్ టర్నౌట్ కనిపించింది. కుటుంబాలతో కలిసి సినిమా చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపడంతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు కూడా బాగానే నమోదయ్యాయి.
మేకర్స్ ప్రకటించిన వివరాల ప్రకారం, ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించి సూపర్ హిట్గా నిలిచింది. కామెడీతో పాటు గ్రామీణ రాజకీయాల నేపథ్యంలో వచ్చే వ్యంగ్య సన్నివేశాలు, ఎమోషనల్ టచ్ కూడా ప్రేక్షకులను మెప్పించాయి. థియేట్రికల్ రన్ విజయవంతంగా ముగించుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ రిలీజ్కు సిద్ధమవుతోంది. ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఫిబ్రవరి 11 నుంచి స్ట్రీమింగ్ ప్రారంభమయ్యే అవకాశముందని టాక్ వినిపిస్తోంది. అయితే మరికొన్ని వర్గాలు ఫిబ్రవరి 13 తేదీని కూడా పరిశీలిస్తున్నట్లు చెబుతున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది.
థియేటర్లలో ఇప్పటికే మంచి స్పందన అందుకున్న ‘అనగనగా ఒక రాజు’ సినిమా ఓటీటీలో కూడా అదే స్థాయిలో రెస్పాన్స్ దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. నవీన్ పోలిశెట్టి కామెడీకి ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉండటం, ఫ్యామిలీ ఎంటర్టైనర్ కావడం వంటి అంశాలు డిజిటల్ ప్రేక్షకులను కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. థియేటర్లలో మిస్ అయిన వారు లేదా మరోసారి నవ్వుల విందు ఆస్వాదించాలనుకునే వారు ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

