గట్టు, సెప్టెంబర్ 16 : జోగుళాంబ గద్వాల జిల్లా గట్టు మండలం రాయాపురం శివారు లో వ్యవసాయ పరిశోధనా కేంద్రం ఏర్పాటు కోసం ప్రభుత్వం తమ భూములను గుంజుకోవద్దని రైతులు వేడుకుంటున్నారు. రాయాపురం శివారులో సర్వే నంబర్ 83లో 50 ఎకరాలు సేకరించాలని అధికారులు భావిస్తున్నారు.
ఇందులో భాగంగా ఆర్ఐ రాజు, జీపీవో రంగన్న, సర్వే సిబ్బంది సదరు సర్వే నంబర్లోని పొలాలను బుధవారం పరిశీలించారు. దళిత రైతులు అక్కడికి చేరుకుని కొద్దిపాటి భూములను లాక్కుంటే తమ భవిష్యత్ ఏమిటని అధికారులను ప్రశ్నించారు. ఆ వెంటనే తహసీల్దార్ కార్యాలయానికి చేరుకొని వినతిపత్రం అందజేశారు.