విక్రమ్ సహిదేవ్, సంధ్యావశిష్ట, తారక్ పొన్నప్ప ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘అనకాపల్లి’. ఖగేష్ తమ్మినేని దర్శకుడు. కాండ్రేగుల నాయుడు, త్రినాథరావు నక్కిన నిర్మించారు. మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్, పూర్వి డిస్ట్రిబ్యూషన్ ద్వారా అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకురానుంది.
ఈ సందర్భంగా ఇటీవల కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. యథార్థ సంఘటనల ఆధారంగా రా అండ్ రస్టిక్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కించిన చిత్రమిదని మేకర్స్ తెలిపారు. త్రినాథరావు నక్కిన, ఇంద్రజ అబ్సర్, మహబూబ్ బాషా తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: దేవ్‌జండ్, కథ, స్క్రీన్‌ప్లే: త్రినాథరావు నక్కిన, దర్శకత్వం: ఖగేష్ తమ్మినేని.