హైదరాబాద్, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర రైతాంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రకాలుగా మోసం చేస్తున్నదని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. వరంగల్ రైతు డిక్లరేషన్ పేరిట అబద్ధపు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, రెండున్నరేండ్లు గడిచినా ఏ ఒక హామీనీ నెరవేర్చలేదని నిప్పులుచెరిగారు. కాంగ్రెస్ చేసిన మోసాన్ని ఎండగట్టేందుకు రైతు డిక్లరేషన్ ప్రకటించిన వరంగల్‌లోనే మే 6న భారీ రైతు సభ నిర్వహించనున్నట్టు ప్రకటించారు. నాలుగేండ్ల కింద రాహుల్‌గాంధీ వరంగల్ వేదికగా ప్రకటించిన డిక్లరేషన్‌తో తెలంగాణ రైతాంగాన్ని వంచించారని, అధికారంలోకి వచ్చాక ఒక హామీని కూడా అమలు చేయకపోవడం కపట మోసం కాదా? అని ప్రశ్నించారు.
రైతు డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ చేసిన మోసాన్ని ప్రజలకు గుర్తుచేసేలా రైతన్నలతో సభ నిర్వహించనున్నట్టు ఉమ్మడి వరంగల్ జిల్లా బీఆర్ఎస్ నేతలు గతంలోనే ప్రకటించారు. ఈ మేరకు హైదరాబాద్‌లో మంగళవారం నిర్వహించిన సమావేశానికి కేటీఆర్‌ను ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ మోసాలకు వ్యతిరేకంగా జరిగే రైతుసభకు తాను హాజరవుతానని చెప్పారు. పార్టీ బలోపేతంతోపాటు, పలు అంశాలపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యవసాయ రంగంలో ఎరువులు, విత్తనాల కొరత, ధాన్యం కొనుగోలులో తీవ్ర సంక్షోభం వంటి సమస్యలు తలెత్తుతున్నాయని కేటీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత అడ్రస్ లేకుండా పోయిన రైతు ఆత్మహత్యలు.. కాంగ్రెస్ పాలనలో తిరిగి ప్రారంభమయ్యాయని, కరెంట్ కోతలతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. రైతాంగానికి బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, పోరాటాలకు సిద్ధమవ్వాలని పిలుపునిచ్చారు.
జిల్లాలో ధాన్యం, మకజొన్నల కొనుగోలు ప్రక్రియ సక్రమంగా సాగక రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని పార్టీ నేతలు కేటీఆర్ దృష్టికి తీసుకొచ్చారు. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి జిల్లావ్యాప్తంగా ఎకడికకడ నిరసన కార్యక్రమాలు చేపడుతామని వెల్లడించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేసేదిశగా చేపట్టాల్సిన కార్యాచరణపై పార్టీ నేతలు కేటీఆర్‌కు పలు వివరాలు అందజేశారు. పార్టీ సభ్యత్వ నమోదు, కమిటీల ఏర్పాటు వంటి సంస్థాగత అంశాలపై కేటీఆర్ కీలక సూచనలు ఇచ్చారు. త్వరలో జరిగే గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీ విజయం కోసం అనుసరించాల్సిన వ్యూహంపైనా నేతలు సుదీర్ఘంగా చర్చించారు.
ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) కార్యక్రమాన్ని అత్యంత ముఖ్యమైన అంశంగా పరిగణించాలని, ప్రతి బూత్‌లో దొం గ ఓట్లు నమోదు కాకుండా చూడాలని పార్టీ నేతలకు కేటీఆర్ సూచించారు. ఈ ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని వినియోగించుకొని కొత్త ఓటర్లను నమోదు చేయించడంతోపాటు ఏ ఒక వ్యక్తీ ఓటు హకు కోల్పోకుండా చూసే బాధ్యత తీసుకోవాలని కోరారు. ఇందుకు సంబంధించి బూత్ లెవెల్ సహాయకుల జాబితాను సిద్ధం చేసి ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు.
నాలుగేండ్ల (2022, మే 6) కింద రాహుల్‌గాంధీ వరంగల్ వేదికగా ప్రకటించిన రైతు డిక్లరేషన్‌తో తెలంగాణ రైతులను వంచించారు. అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు దాటినా ఒక హామీ కూడా అమలు కాలేదు. ఇది కపట మోసం కాదా? అందుకే రాహుల్‌గాంధీ డిక్లరేషన్ ప్రకటించిన అదే రోజున.. అదే గడ్డపై రైతులతో కలిసి కాంగ్రెస్‌ను ప్రశ్నిస్తం.
-కేటీఆర్
లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ వరంగల్ రైతు డిక్లరేషన్ ప్రకటించిన ప్రాంతంలో తాము వచ్చే నెల 6న సభ నిర్వహించి ‘ఏదీ నీ రైతు డిక్లరేషన్?’ అని రైతుల తరఫున ప్రశ్నిస్తామని బీఆర్ఎస్ నేతలు చెప్పారు. ఇవాళ రైతులను అన్ని రకాలుగా మోసగించారని, కాంగ్రెస్ పార్టీ రైతు డిక్లరేషన్ ప్రకటించిన వరంగల్‌లోనే మళ్లీ రైతులకు అండగా రైతు సభ పెట్టాలని నిర్ణయించామని తెలిపారు. సమావేశం అనంతరం మీడియాతో ఉమ్మడి వరంగల్ జిల్లా నాయకులు మాట్లాడుతూ రైతు డిక్లరేషన్‌లో పొందుపర్చిన ఏ ఒక అంశాన్నీ కాంగ్రెస్ అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి గింజనూ కొనుగోలు చేశామని, ఇవాళ రైతులకు గన్నీ బ్యాగులు లేవని, రవాణా సరిగా లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. మకజొన్న కొనుగోలు జాప్యంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. ప్రతి కొనుగోలు కేంద్రాన్నీ సందర్శించి రైతులకు ధైర్యం ఇవ్వడంతోపాటు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతామని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయం దండుగ అంటే, స్వరాష్ట్రంలో కేసీఆర్ హయాంలో వ్యవసాయ రంగం పండుగలా సాగిందని, ఇవాళ మళ్లీ వ్యవసాయం అంటే దండుగలా మారిందని ఆందోళన వ్యక్తంచేశారు. రైతును కాంగ్రెస్ మోసగించిన తీరును సభలో ప్రజలకు వివరిస్తామని చెప్పారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యవసాయ రంగంలో ఎరువులు, విత్తనాల కొరత.. ధాన్యం కొనుగోలులో తీవ్ర సంక్షోభం వంటి సమస్యలు తలెత్తుతున్నయ్. తెలంగాణ ఏర్పడిన తర్వాత అడ్రస్ లేకుండా పోయిన రైతు ఆత్మహత్యలు.. కాంగ్రెస్ పాలనలో తిరిగి ప్రారంభమైనయ్.
-కేటీఆర్