సిరిసిల్ల రూరల్, నవంబర్ 20 : తూకం వేసిన ధాన్యంలో మిల్లర్లు, నిర్వాహకులు కోత పెడుతున్నారని రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం తాడూరు రైతులు, మాజీ సర్పంచ్, కాంగ్రెస్ నేత గుర్రం రాజలింగంగౌడ్ కొనుగోలు కేంద్రంలో గురువారం ఆందోళనకు దిగారు. తాడూరు ఐకేపీ కొనుగోలు కేంద్రంలో నిబంధనల ప్రకారం తేమశాతం చూసుకుని, బస్తాలను మిల్లుకు పంపించారు.
15 రోజుల క్రితం తూకం వేసిన ధాన్యానికి ఇప్పుడు కోత విధిస్తున్నామంటున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.