కొడంగల్, నవంబర్ 7: ‘మాకు అభివృద్ధి వద్దు.. ఈ సీఎం రేవంత్‌రెడ్డి అసలే వద్దు.. మా భూముల జోలికి వస్తే ఊరుకునేది లేదు. ఎన్ని మీటింగ్‌లు పెట్టినా బహిష్కరిస్తాం’ అని వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండల ఫార్మా భూబాధిత రైతులు స్పష్టం చేశారు. ఈ మేర కు వారు దుద్యాల తహసీల్దార్ కార్యాల యం ఎదుట బైఠాయించి నిరసన తెలిపా రు. ‘మాకు అభివృద్ధి వద్దు, సీఎం వద్దు.. మా భూములే మాకు ముద్దు’ అంటూ రైతులు ముక్త కంఠంతో నినదించారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా రైతు లు మాట్లాడుతూ.. ఫార్మా కంపెనీకి భూము లు ఇచ్చేందుకు సిద్ధంగా లేమని స్పష్టం చేశారు. అధికారులు తమ భూములు స్వాధీ నం చేసుకునేందుకు ఎటువంటి ప్రయత్నా లు చేసినా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవా ల్సి వస్తుందని హెచ్చరించారు. ప్రభుత్వం ఎటువంటి సంక్షేమ పథకాలు అందించకపోయినా పర్వాలేదు.. కానీ భూములను మా త్రం వదులుకునేది లేదని అన్నారు. గ్రామా ల్లో కాకుండా దుద్యాలలో ప్రత్యేకంగా సమావేశాన్ని ఏర్పాటు చేసి రైతులను అక్కడికే రావాలనే పిలుస్తున్నారని, అధికారులు తీరు మార్చుకోకపోతే చావోరేవో తేల్చుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. ఈ నిరసనలో దుద్యాల, లగచెర్ల, హకీంపేట, రోటిబండతండా, పులిచెర్లకుంటతం డా ఫార్మా భూబాధితులు పాల్గొన్నారు.