కల్వకుర్తి రూరల్, ఏప్రిల్ 6 : పాలధర తగ్గించి రైతులను ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేయడాన్ని నిరసిస్తూ నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం మార్చాలకు చెందిన కిశోర్‌రెడ్డి నిరాహారదీక్ష చేపట్టారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల విజయ డెయిరీ పాల ధరలను సవరించిందని చెప్పారు.
ఫ్యాట్ ఎక్కువగా ఉన్న దానిపై రూ.1.50 పైసలు పెంచుతూ.. ఫ్యాట్ తక్కువగా ఉండే పాలపై ఏకంగా రూ.4 తగ్గించిందని వివరించారు. దీంతో మెజార్టీ పాడి రైతులు నష్టపోయే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తంచేశారు. పాల ధర తగ్గింపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడంతోపాటు పెండింగ్‌లో ఉన్న బిల్లులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.