ఇచ్చోడ, జూలై 3 : రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో ఎరువుల కొరతతో పొరుగు రాష్ట్రం మహారాష్ట్రకు వెళ్లాల్సి వస్తున్నదని ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రా(కే) గ్రామ రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. ఇచ్చోడ మండలంలో డీఏపీ దొరక్కపోవడంతో శుక్రవారం మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కేంద్రానికి వెళ్లి డీఏపీ కొనుగోలు చేశామని తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వానికి కనీసం డీఏపీ ఇవ్వడం కూడా చేతనైతలేదని, రేవంత్రెడ్డి కేవలం మా టలకే పరిమితం అవుతున్నారన్నారని మండిపడ్డారు. కేసీఆర్ పాలనలో ఆటో వాడి కి డ బ్బులిస్తే ఇంటికే ఎరువులు తెచ్చి ఇచ్చేవారని, నేడు కాంగ్రెస్ పాలనలో ఏకంగా రాష్ర్టాలు దా టి వెళ్లాల్సిన దుస్థితి వచ్చిందని అన్నారు.