సిద్దిపేట/ దుబ్బాక, జూలై 4 : సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం అక్బర్పేట-భూంపల్లి మండలం చౌదర్పల్లిలో సర్వే నంబరు 294లో అసైన్డ్ భూముల అక్రమణలపై విచారణ చేపట్టి తమకు న్యాయం చేయాలని కోరుతూ శుక్రవారం బాధిత రైతులు సిద్దిపేట సీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. చౌదరపల్లికి చెందిన వడ్డెర, కుమ్మరి, గౌడ, ఎరుకల కులస్థులకు గతంలో ప్రభుత్వం సర్వే నంబరు 294లో 176 ఎకరాలు అసైన్డ్ భూములు అందజేసినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఆ భూమిని మెదక్ ఎంపీ రఘునందన్‌రావు అండదండలతో ఆయన సతీమణి మాధవనేని మంజులాదేవి, కుటుంబ సభ్యురాలు సింధూజ పేరిట అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని ఆరోపించారు. వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఆ భూములను ఎంపీ రఘునందన్ కుటుంబ సభ్యులు, అనుచరులు కబ్జా చేయడంతో తాము బతుకుదెరువు కోల్పోయామని ఆవేదన వ్యక్తంచేశారు.