హైదరాబాద్, ఫిబ్రవరి 5 (నమ స్తే తెలంగాణ): రా ష్ట్ర వ్యాప్తంగా ఒక ఎకరం వరకు సాగు భూములున్న రైతులకు బుధ వారం రైతుభరోసా నిధులు జమ చేసి నట్టు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఒక ఎకరం వరకు సాగులో ఉన్న 17.03 లక్షల రైతుల అకౌంట్లలో నిధులు జమ చేసినట్టు వివరించారు. ప్రారంభోత్స వం రోజు విడుదలచేసినవాటితో కలిపి ఇప్పటి వరకు మొత్తం రూ.1,126.54 కోట్లు రైతుభరోసా కింద జమ చేసినట్టు వెల్ల డించారు. యాసంగి సీజన్లో కూడా సన్న ధాన్యానికి రూ.500 బోనస్ కొనసాగిస్తామని చెప్పారు.
కృష్ణా, తుంగభద్ర నదులకు నీటిని వదలండి ; కన్నడ సీఎంను కలిసి విజ్ఞప్తి చేసిన మంత్రి, ఎమ్మెల్యేలు
గద్వాల అర్బన్, ఫిబ్రవరి 5 : సాగు, తాగునీటి అవసరాల కోసం నీటిని విడుదల చేయాలని కర్ణాటక ప్రభుత్వాన్ని కోరేందుకు మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, మధుసూదన్‌రెడ్డి, మేఘారెడ్డి, వాకిటి శ్రీహరి, మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ బుధవారం బెంగళూరుకు చేరుకున్నారు. సీఎం సిద్ద రామయ్యని కలిసి సాగు, తాగునీటి అవసరాలకు నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి జూరాల డ్యాంకు 5 టీఎంసీలు కృష్ణానదికి.. తుంగభద్ర నదికి ఒక టీఎంసీ విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.