బోనకల్లు/చింతకాని, మార్చి 26 : మార్క్ఫెడ్ ద్వారా మక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోతినేని సుదర్శన్రావు, సీపీ ఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు స ర్కార్పై మండిపడ్డారు. ఖమ్మం జిల్లా బోనక ల్లు, చింతకాని తదితర మండలాల్లో కొనుగో లు కేంద్రాలు లేని కారణంగా రైతులు పం ట ను దళారులకు అమ్మి నష్టపోతున్నారని ఆ వేదన చెందారు.
డిప్యూటీ సీఎం భట్టి విక్రమా ర్క తన సొంత నియోజకవర్గ రైతులను పట్టించుకోకుండా నిద్రపోతున్నారా? అని ఆగ్ర హం వ్యక్తంచేశారు. బోనకల్లు, చింతకాని త హసీ కార్యాలయాల ఎదుట రైతులతో కలిసి ధర్నా నిర్వహించారు. తొలుత బోనకల్లులో భారీ ప్రదర్శన నిర్వహించారు. ఎకరానికి 40 క్వింటాళ్ల దిగుబడి వస్తుంటే.. ప్రభు త్వం కేవలం 25 క్వింటాళ్లే కొనుగోలు చేస్తామని చెప్పడం దారుణమని, కేంద్రాలు ఏర్పాటు చే యకపోతే పోరాడుతామని హెచ్చరించారు.