హైదరాబాద్, మార్చి 22 (నమస్తే తెలంగాణ): రూ.2 లక్షలపైన రుణాలు ఉన్న రైతుల కుటుంబాలకు రుణమాఫీ చేసేది లేదని, ఇది ప్రభుత్వ నిర్ణయమని, ఈ విషయంలో ఎటువంటి కన్ఫ్యూజన్ లేదని వ్యవసాయ శాఖ మంత్రి అసెంబ్లీలో ప్రకటించడంతో ఇక రుణమాఫీ కథ ముగిసినట్టయ్యింది. రూ.2 లక్షలకుపైగా రుణాలు ఉన్న రైతులు, ఆ పై మొత్తం కడితే రుణమాఫీ చేస్తామంటూ ఇన్నాళ్లూ ఊరిస్తూ వచ్చిన ప్రభుత్వం చివరకు మొండిచేయి చూపింది.
దీంతో మిగిలిన రైతులకు రుణమాఫీ ప్రక్రియను పకకు పెట్టినట్టేననే సంకేతాలను ప్రభుత్వం జారీ చేసిందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. సరారు లెకల ప్రకారం 42 లక్షల మంది రైతులకు రూ.31 వేల కోట్లు రుణమాఫీ చేయాలి. కానీ, ఇప్పటివరకు ప్రభుత్వం నాలుగు విడతల్లో 25.35 లక్షల మంది రైతులకు రూ.20,616 కోట్లు మాత్రమే రుణమాఫీ చేసింది. ఈ లెకన ఇంకా 16.65 లక్షల మంది రైతులకు రూ.10,384 కోట్లు రుణమాఫీ చేయాల్సి ఉన్నది. లక్షల మంది రైతులకు రూ.వేల కోట్లు పెండింగ్లో ఉండగా రుణమాఫీ పూర్తయినట్టు ఎలా అవుతుందని రైతులు ప్రశ్నిస్తున్నారు.