బొంరాస్‌పేట, ఆగస్టు 21 : వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని దుద్యా ల మండలంలో ప్రభుత్వం ఏర్పాటు చేయతలపెట్టిన ఫార్మా విలేజ్‌కు వ్యతిరేకంగా రైతులు ఏకమవుతున్నారు. ఫార్మా విలేజ్‌ను అడ్డుకోవడానికి దశలవారీ పోరాటాలకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ధర్నాలు చేపట్టి, అధికారుల కు వినతిపత్రాలు అందజేసిన ఆయా గ్రామా ల రైతులు బుధవారం దుద్యాల తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. అంతకుముందు పోలేపలి ్లఎల్లమ్మ దేవాలయం వద్ద సమావేశమై అక్కడి నుంచి హకీంపేట మీదు గా పాదయాత్రగా దుద్యాల మండల కేంద్రానికి చేరుకున్నారు. తహసీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించారు. ‘ఫార్మా గోబ్యాక్’ అంటూ నినదించారు. ఫార్మా విలేజ్‌కు సాగు భూములిచ్చేది లేదని తెగేసి చెప్పారు. ప్రభు త్వం స్పందించకుంటే తహసీల్దార్ కార్యాలయాన్ని తగలబెడతామని హెచ్చరించారు. అనంతరం తహసీల్దార్‌కు వినతిపత్రం ఇచ్చా రు. నిరసనలో పోలేపల్లి, హకీంపేట, లగచెర్ల, పులిచెర్లకుంట తండా రైతులు పాల్గొన్నారు.