హైదరాబాద్, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ): రేవంత్‌రెడ్డి ప్రభుత్వంలో యూరియా కోసం రైతులు నిత్యయాతన పడుతున్నారు. కోడికూయకముందే సహకార కేంద్రాల వద్దకు వచ్చి క్యూ కడుతున్నారు. అయినా కూడా యూరియా బస్తాలు దొరక్కపోవడంతో దిగాలుగా వెనుదిరుగుతున్నారు. పదేండ్లుగా ఎన్నడూ లేని కష్టాలు కోరి మరీ తెచ్చుకున్నామని మదనపడుతున్నారు. ఈ యేడు పంటలకు సరిపడా యూరియా దొరకే పరిస్థితి లేకపోవడంతో పంటలు ఎలా కాపాడుకోవాలో అర్థంకాక తలలు పట్టుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ముందుచూపు లేని కారణంగా ఈ దుర్భర పరిస్థితులు దాపురించాయని మండిపడుతున్నారు.
యూరియా ఇచ్చే దాక.. కదిలేదిలేదు..
పెద్దపల్లిలో వివిధ గ్రామాల రైతులతో కలిసి ధర్నా చేస్తున్న మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు
ఈ సర్కారు కో దండం..
సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి రైతు వేదిక వద్ద యూరియా బస్తాల కోసం ముందురోజు రాత్రి నుంచే పడిగాపులు కాస్తున్న రైతులు
నా ప్రాణం మీదికొచ్చింది..
మహబూబాబాద్ జిల్లా పురుషోత్తమాయగూడెంలో యూరియా కోసం వెళ్లి వస్తూ రోడ్డు ప్రమాదానికి గురై దవాఖానలో చికిత్స పొందుతున్న బోడతండాకు చెందిన రైతు నర్సింగ్
కట్టలు తెంచుకున్న ఆగ్రహం..
సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి రైతు వేదిక వద్ద సిబ్బంది యూరియా టోకెన్ల జారీలో జాప్యం చేయడంతో ఆగ్రహంతో కుర్చీలు విరగ్గొడుతున్న రైతులు
యూరియా కోసం వెళ్లి మృతి ..
యూరియా కోసం వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో రోడ్డు ప్రమాదానికి గురైన రైతు మృతి చెందిన ఘటన మ హబూబాబాద్ జిల్లా పెద్దవంగర మం డలంలోని కాన్వాయిగూడెంలో బుధవారం జరిగింది. గ్రామానికి చెందిన రైతు ఐలయ్య36) యూరియా కోసం జనగామ జిల్లా కొ డకండ్ల మండల కేంద్రానికి వెళ్లి రెండు బస్తాలను తీసుకొచ్చాడు. మరికొన్ని బస్తాల కోసం ద్విచక్రవాహనంపై వెళ్లి వస్తున్న క్ర మంలో రోడ్డు ప్రమాదానికి గురికావడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. వరంగల్ ఎంజీఎం దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.
భిక్షాటనతో సర్కారుకు కనువిప్పు కావాలె..
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని ముక్రా(కే) గ్రామంలో ఇంటింటికి తిరిగి యూరియా భిక్షాటన చేస్తున్న రైతులు
టోకెన్ల కోసం కొండంత ఎదురుచూపు..
సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి రైతు వేదిక వద్ద యూరియా కోసం మంగళవారం రాత్రి నుంచి అక్కడే పడుకొని, తెల్ల్లవారుజామున టోకెన్ల కోసం క్యూకట్టిన రైతులు
పరకాలలో రాస్తారోకో
యూరియా పంపిణీలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ హనుమకొండ జిల్లా పరకాలలో ప్రధాన రహదారిపై ధర్నా చేస్తున్న రైతులు