అందని సాగునీరు, ఆపై కరెంటు కష్టాలు.. అన్నదాతకు అగ్నిపరీక్ష పెడుతున్నాయి. లోవోల్టేజీతో తరచూ ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతుండటంతో పంటలను కాపాడుకునేందుకు రైతులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం దాట్లలో సోమవారం ట్రాన్స్ఫార్మర్ కాలిపోగా.. రైతులే పొలాల మధ్యనుంచి అరకిలోమీటరు వరకు మోసుకుంటూ రిపేరుకు తీసుకెళ్లారు.