తొర్రూరు, మే 23 : కొనుగోలు కేంద్రాల్లో అవకతవకలకుతోడు రవాణాకు లారీల కొరత నెలకొనడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కాంగ్రెస్ పార్టీకి చెందిన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు సొసైటీ చైర్మన్ కాకిరాల హరిప్రసాద్ పేర్కొన్నారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై మంత్రి ఉత్తమ్‌కు శనివారం లేఖ పంపారు. ఈ సందర్భంగా హరిప్రసాద్ మాట్లాడుతూ.. ప్రభుత్వం నియమించిన ట్రాన్స్పోర్టర్.. కొనుగోలు కేంద్రాలకు అవసరమైన వాహనాలను అందించకపోవడంతో కేంద్రాల్లో ధాన్యం నిల్వలు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. దీనిపై సర్కార్ స్పందించి ట్రాన్స్పోర్టర్పై తక్షణ చర్యలు తీసుకోవాలని, పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు.