యాదాద్రి భువనగిరి : ట్రిపుల్ ఆర్(RRR alignment) భూ సేకరణపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలైన్మెంట్ మార్చాలని, లేదంటే భూమికి బదులు భూమినైనా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకుయాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రం ఆర్డీవో(RDO) కార్యాలయం ఎదుట ధర్నా(Farmers darna) నిర్వహించారు. ఆర్డీవో శేఖర్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ మార్చి వ్యవసా యేతర భూముల్లో నుంచి ట్రిపుల్ ఆర్ రోడ్ వెళ్లే విధంగా డిజైన్ మార్చాలని రైతులు కోరారు.
దశాబ్దాలుగా వ్యవసాయమే అధారంగా జీవిస్తున్నామని, రీజినల్ రింగ్ రోడ్డుకు తమ భూమి తీసుకుంటే రోడ్డున పడుతామని ఆందోళన వ్యక్తం చేశారు. రోడ్డు అలైన్మెంట్ మార్చాలని లేదా బహిరంగ మార్కెట్లో పలుకుతున్న ధర అనుసరించి నష్టపరిహారం ఇవ్వాలని, లేకుంటే భూమికి బదులు భూమి ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీనిపై తక్షణమే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, బాధిత రైతులు, తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
KTR | కంప్యూటర్లను కనిపెట్టడంలో రేవంత్ రెడ్డి బిజీ.. కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు
Breast Cancer | ‘రొమ్ము క్యాన్సర్’ను ప్రాథమిక దశలోనే గుర్తిస్తూ.. వేల మరణాలను ఆపుతున్న అంధులు
KTR | అంకెలు ఎప్పుడూ అబద్ధం చెప్పవు.. కేసీఆర్ సాధించిన విజయాలు ఎప్పటికీ చెదిరిపోవు : కేటీఆర్