హైదరాబాద్ : కాంగ్రెస్ పాలనలో ప్రజలు కష్టాల పాలవుతున్నారు. అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పంటలు ఎండిపోతున్నా ప్రభుత్వం సాగునీళ్లు ఇవ్వడం లేదని రైతులు రోడ్డెక్కుతున్నారు. తాజాగా నల్లగొండ(Nallgonda) జిల్లా నార్కట్పల్లి-అద్దంకి హైవేపై రైతులు ధర్నా(Farmers dharna) చేపట్టారు. మాడుగులపల్లి మండల కేంద్రంలో వరద కాలువ – LLC నీటి కోసం( Irrigation water) రైతులు ఆందోళన బాటపట్టారు.
కాలువలో పిచ్చి మొక్కలు, తాటి చెట్లు వేయడంతో దిగువకు నీళ్లు రావడం లేదన్నారు. బోరు బావుల కింద సాగుచేసిన వరి పంట పొలాలు ఎండిపోతున్నాయని రైతుల ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి సమస్య పరిష్కరించకుంటే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. రైతులకు, పోలీసులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. కాగా, రైతుల ధర్నాతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.
నల్లగొండలో సాగు నీటి కోసం రైతుల ధర్నా..
రైతులకు, పోలీసులకు మధ్య తోపులాట, ఘర్షణ వాతావరణం.
నల్లగొండ – మాడుగులపల్లి మండల కేంద్రంలో వరద కాలువ – LLC నీటి కోసం రైతుల ధర్నా
కాలువలో పిచ్చి మొక్కలు, తాటి చెట్లు వేయడంతో దిగువకు రాని కాలువ నీరు.. బోరు బావుల కింద సాగుచేసిన వరి పంట పొలాలు… pic.twitter.com/oELpARsfCA
— Telugu Scribe (@TeluguScribe) August 19, 2024