బేల, డిసెంబర్ 22: మార్కెట్ యార్డులో సోయా కొనుగోళ్లు చేపట్టాలని డిమాండ్ చేస్తూ రైతుల పిలుపు మేరకు సోమవారం ఆదిలాబాద్ జిల్లా బేల మండల కేంద్రం బంద్ విజయవంతమైంది. వ్యాపారులు తమ దుకాణాలు స్వచ్ఛందంగా మూ సివేశారు. రైతుల నిరసనకు అఖిలపక్షం నాయకులు మద్దతు పలికారు. ఈ సందర్భంగా రైతులు, అఖిలపక్షం నాయకులు బేల మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ వద్ద అంతర్రాష్ట్ర రహదారిపై ధర్నా చేపట్టారు.
ఈ ధర్నాలో జడ్పీ మాజీ చైర్పర్సన్ సుహాసినిరెడ్డితోపాటు బీఆర్ఎస్, నాయకులు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రావుత్ మనోహర్, కాంగ్రెస్, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అఖిలపక్ష నేతలు, రైతులు మాట్లాడుతూ.. వర్షాల వల్ల తడిసిన సోయాను కొనుగోలు చేయడానికి ముందుకు రావడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇకనైనా కొనుగోలు చేయాలని కోరారు.