భిక్కనూరు, మే 24: వర్షాలకు తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం తక్షణమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి జిల్లా భిక్కనూర్ మండల కేంద్రంలో శనివారం సాయంత్రం రైతులు ఆందోళనకు దిగారు. రోడ్డుపై తడిసిన ధాన్యాన్ని పోసి రాస్తారోకో నిర్వహించారు.
ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. తడిసిన ధాన్యాన్ని తేమతో సంబంధం లేకుండా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. పంట కోసి 20రోజులైనా ధాన్యాన్ని తూకం వేయడంలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. వర్షాలకు తడవడంతో వడ్లకు మొలకలు వస్తున్నాయని ఆవేదన చెందారు.