ముస్తాబాద్, అక్టోబర్ 10: వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలనే సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మోహినికుంట రైతాంగం కదిలింది. నూనె పంటలే సాగుచేస్తామని ఏకగ్రీవ తీర్మానం చేసింది. మోహినికుంటలో ఆదివారం రైతులు సమావేశం కాగా.. రైతుబంధు సమితి మండల కన్వీనర్ కల్వకుంట్ల గోపాల్రావు హాజరై వారికి పలు సూచనలు చేశారు. రైతుల శ్రమకు తగ్గ ఫలితం రావాలనే లక్ష్యంతో ప్రభుత్వం వరికి ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహిస్తున్నదన్నారు. ఆ దిశగా నూనె గింజల పంటలు వేయాలని సూచించారు. వానకాలం పంటల తర్వాత నూనె గింజల పంటలు వేస్తామని రైతులు తీర్మానం చేశారు. కాగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో పంట మారాల్సిందేనని తీర్మానం చేసిన తొలి గ్రామంగా మోహినికుంట నిలిచింది.