గిరిజనులు ఇండ్లకు, వ్యవసాయ భూముల్లోకి వెళ్లకుండా కొంతమంది దారిని కబ్జా చేయడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని , వెంటనే హెలికాప్టర్ కొనిచ్చి తమను ఆదుకోవాలని ఎరుకల (ఎస్టీ) కుటుంబాలు, రైతులు సోమవారం ప్రజావాణిలో ఫిర్యాదుచేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం బహదూర్‌పేట నుంచి చిన్నకందుకూరును కలిపే లింకు రోడ్డు పూర్వకాలం నుంచి ఉంది. గ్రామానికి చెందిన బర్మ మల్లయ్య, బర్మ కిష్టయ్య (అన్నదమ్ములు) బహదూర్‌పేట నుంచి చిన్నకందుకూరుకు వెళ్లే రోడ్డును ఆక్రమించడంతో దారిలేకుండాపోయింది.
దీనిపై గతంలో కలెక్టర్, ఆలేరు తహసీల్దార్‌కు ఫిర్యాదుచేయగా అదనపు గిర్దావర్, మండల సర్వేయర్ మార్చి18న పంచనామా నిర్వహించి పబ్లిక్ రోడ్డేనని తేల్చి పోలీసుల సహాయంతో బాటను పునరుద్ధించారు. సోమవారం రోడ్డుకు అడ్డంగా బండరాళ్లను పెట్టి చుట్టూ ఫెన్సింగ్వేశారు. పోలీస్ స్టేషన్ల్లో ఫిర్యాదు చేయగా సీఐ రోడ్డును ఆక్రమించిన వారికే సపోర్ట్ చేస్తున్నారని బాధితులు వాపోయారు.
‘కలెక్టర్ రావాలి.. సమస్యలు పరిష్కరించాలి’ అని డిమాండ్ చేస్తూ కాళేశ్వరం ప్రాజెక్టు 9వ ప్యాకేజీలో పట్టాలు కోల్పోయిన వీర్నపల్లి మండలంలోని రైతులు సోమవారం రాజన్నసిరిసిల్ల కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. చలో కలెక్టరేట్ పిలుపులో భాగంగా ప్రజాసంఘాల నాయకుడు మల్లారపు అరుణ్ ఆధ్వర్యంలో రైతులు కలెక్టరేట్‌కు చేరుకున్నారు.