BRS | సంగెం, జనవరి 29 : రైతు ఆత్మహత్యలపై బీఆర్ఎస్ అధ్యయన కమిటీ గురువారం వరంగల్ జిల్లా సంగెం మండలం పల్లార్గూడ గ్రామంలో పర్యటించనున్నది. పోచమ్మతండా గ్రామపంచాయతీ పరిధిలోని మహారాజ్తండాకు చెందిన రైతు బానోత్ తిరుపతి అప్పుల బాధతో ఇటీవల ఆత్మహత్య చేసుకున్నాడు. రైతు ఆత్మహత్యల బీఆర్ఎస్ అధ్యయన కమిటీ సభ్యులు గురువారం సదరు రైతు కుటుంబాన్ని పరామర్శించనున్నారు. ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు?, కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నాయి? తదితర విషయాలను తెలుసుకోనున్నారు. అనంతరం గ్రామంలో రైతులతో సమావేశం నిర్వహించనున్నారు. మాజీ మంత్రి హరీశ్‌రావు, కమిటీ చైర్మన్, మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి,తోపాటు సభ్యులు పాల్గొననున్నారు.