హైదరాబాద్, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం అల్మాస్పల్లిలో గ్రీన్ రివల్యూషన్, భారత్ బీజ్స్వరాజ్ మంచ్ ఆధ్వర్యంలో మూడ్రోజులపాటు నిర్వహించిన తెలంగాణ తొలి విత్తన పండుగ ఆదివారం ముగిసింది. ము గింపు కార్యక్రమానికి రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, కమిషన్ సభ్యులు కేవీఎన్‌రెడ్డి హాజరయ్యారు.
వివిధ రాష్ట్రాలకు చెందిన రైతులు తయారు చేసిన విత్తనాలను స్టాల్స్‌లో ప్రదర్శించారు. 30కిపైగా స్టాళ్లను ఏర్పాటు చేసిన రైతులు.. విత్తన తయారీలో తమ అనుభవాలను రైతు కమిషన్‌కు వివరించారు. ఈ సందర్భంగా కోదండరెడ్డి మాట్లాడుతూ.. విత్తనం రైతు ప్రాథమిక హక్కు అని, కానీ, మూడు దశాబ్దాలుగా అది మల్టీనేషనల్ కంపెనీల చేతుల్లోకి వెళ్లిందని అన్నారు. ఫలితంగానే రైతు ఆత్మహత్యలు మొదలయ్యాయని పేర్కొన్నారు.