యాచారం, జూలై 31: తమ భూము ల జోలికి రావొద్దని ఫార్మాసిటీ బాధిత రై తులు అధికారులను హెచ్చరించారు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మేడిపల్లిలో ఫార్మాసిటీ ఏర్పాటు కోసం గతంలో సేకరించిన భూములకు రేడియ ల్ సర్వే చేసేందుకు టీజీఐఐసీ, రెవెన్యూ అధికారులు గురువారం ఉదయం పోలీ సు బందోబస్తుతో గ్రామానికి వచ్చారు. విషయం తెలుసుకున్న ఫార్మాసిటీ వ్యతిరేక పోరాట కమిటీ సభ్యులు, రైతులు గ్రామస్థులు భారీగా అక్కడికి చేరుకున్నా రు. యాచారం తహసీల్దార్ అయ్యప్ప ఆ ధ్వర్యంలో ఫార్మా భూములకు రేడియల్ (డిజిటల్) సర్వే చేసేందుకు వచ్చిన అధికారులను రైతులు అడ్డుకున్నారు.
ఇక్కడ భూములకు సర్వే చేయాలని కోర్డు ఆర్డర్ ఉన్నదా? అంటూ అధికారులను ప్రశ్నించారు. కోర్టు ఆర్డర్ వచ్చే వరకు భూములను సర్వే చేయొద్దని పట్టుబట్టారు. దీం తో ఏసీపీ రాజు కల్పించుకొని రైతులకు సర్దిచెప్పారు. ఈ క్రమంలో రైతులకు పోలీసులకు మధ్య కొద్దిసేపు వాగ్వాదం చోటుచేసుకున్నది. కోర్టు స్టే ఉన్న 2,500 ఎకరాల భూముల జోలికి రావొద్దని రైతులు అక్కడికి వచ్చిన ఆర్డీవోకు సూచించారు. స్టే ఉన్న భూముల్లో ఎ లాంటి హద్దు రాళ్లు పాతినా వెంటనే తొలగిస్తామని హెచ్చరించారు. ముందు గా తమ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించాలని, రైతుల పేర్లను ఆన్లైన్లో ఎక్కించాలని, రైతుభరోసా అందేలా చూడాలని రైతు లు డిమాండ్ చేశారు. ఫార్మాసిటీకి సేకరించని భూముల జోలికి వస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
గతంలో సేకరించిన భూములకు ఇప్పటికే రైతులకు పరిహారంతోపాటు ఎకరాకు 121 గజా ల చొప్పున ప్లాట్లు ఇచ్చామని ఆర్డీవో అనంతరెడ్డి పేర్కొన్నారు. గతంలో సేకరించిన భూములకు మాత్రమే ప్రభుత్వ ఆదేశాల మేరకు రేడియల్ సర్వే చేస్తామని తెలిపారు. ఉన్నతాధికారులతో మాట్లాడి స మస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఆర్డీవో హామీ ఇచ్చారు. గతంలో అ ధికారులు, ప్రజాప్రతినిధులు, పోలీసు లు పలుమార్లు తమకు న్యాయం చేస్తామని హామీలిచ్చినా ఇప్పటివరకు నెరవేర్చలేదని రైతులు మండిపడ్డారు. కోర్టు కేసులు, స్టే ఉన్న భూములను మినహాయించి మిగతా భూములను రేడియల్ సర్వే చేస్తామని ఆర్డీవో సూచించారు. అనంతరం రైతులు తమ సమస్యలపై ఆర్డీవోకు వినతిపత్రం అందజేశారు.