హైదరాబాద్, మే 20 (నమస్తే తెలంగాణ): సైబర్ నేరగాళ్లు.. ఇప్పుడు రైతులకు వల విసురుతున్నారు. ‘ప్రధాన మంత్రి కిసా న్ యోజన’ పథకాన్ని లక్ష్యంగా చేసుకుని అన్నదాతలను కొల్లగొట్టేందుకు సిద్ధమవుతున్నారు. వాట్సాప్ లాంటి సామాజిక మాధ్యమాల ద్వారా ‘PM Kisan Yojana’కు బదులుగా ‘PM KISHAN YOJAN A.apk’ పేరిట మాల్వేర్తో కూడిన ఆం డ్రాయిడ్ ప్యాకేజీ కిట్ (ఏపీకే) ఫైల్‌ను పం పుతున్నారు.
దాన్ని ఓపెన్ చేసి, యూనిక్ ఐడీ కోసం రిజిస్ట్రేషన్ చేయగానే మొబైల్ ఫోన్ హ్యాకింగ్‌కు గురవుతున్నది. ఫోన్‌ను రీస్టార్ట్ చేసినప్పటికీ వాట్సాప్ హ్యాంగ్ అ యింది. అప్పటికే ఆ ఫోన్లోని వాట్సాప్ కాంటాక్ట్స్ అనుమతి లేకుండానే ఇతరులకు షేర్ అవుతున్నాయి. మంగళవారం ఓ మిత్రుడు ఫార్వర్డ్ చేసిన ‘PM KISHAN YOJANA.apk’ ఫైల్‌ను యువరైతు గాంధీ ఓపెన్ చేయడంతో ఆ ఫోన్ హ్యాక్ అయింది.
అలా వారం రోజుల్లో తెలంగాణ లో పలువురు రైతుల ఫోన్లను సైబర్ మోసగాళ్లు హ్యాక్ చేసి డబ్బులు కొల్లగొట్టినట్టు సమాచారం. apk, .exe, .pif లాంటి ఎక్స్టెన్షన్లతో ముగిసే లింకులను ఓపెన్ చేయొద్దని, వాటిని మరొకరికి ఫార్వర్డ్ చేసేముందు ఆలోచించుకోవాలని సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు హెచ్చరిస్తున్నారు.