బాల్కొండ : విద్యుత్తు సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రైతులు నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల కేంద్రంలోని సబ్‌స్టేషన్‌ను మంగళవారం ముట్టడించారు. 15 రోజులుగా విద్యుత్తు సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడుతుండటంతో పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు.
సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్తే పక్షులు కరెంట్ తీగలకు తగులుతుండటంతో ట్రిప్ అవుతుందంటూ సమాధానం చెప్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో కోతలు లేకుండా నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేసిన విషయాన్ని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాకే తమకు ఇబ్బందులు మొదలయ్యాయని ఆగ్రహం వ్యక్తంచేశారు.