నర్సింహులపేట, ఫిబ్రవరి 18: మహబూబాబాద్ జిల్లా నర్సింహుల పేట మండల పరిధి ఆకేరువాగులో నీటి లభ్యత లేక అన్నదాతలు అరిగోస పడుతున్నారు. యాసంగి వరి పంటకు నీరు అందించేందుకు తిప్పలు పడుతున్నారు. వానకాలంలో కురిసిన భారీ వర్షాలకు జయపురం, ముంగిముడుగు గ్రామాల్లోని ఆకేరువాగుపై ఉన్న చెక్‌డ్యాంలు తెగిపోవడంతో వాగుల్లోనీరు నిలిచే అవకాశం లేకుండాపోయింది. దీంతో కొందరు చెలిమె నీటితో ఉన్న కొద్దిపాటి పొలాన్ని తడుపుకుంటున్నారు.