హైదరాబాద్ : కాంగ్రెస్(Congress) పాలనలో సబ్బండ వర్ణాల ప్రజలు సకల గోసలు పడుతున్నారు. ఇన్నాళ్లు సాగు, తాగు నీళ్ల కోసం అల్లాడిన జనం నేడు కరెంట్ కష్టాలతో కడుపునిండా తిండి, కంటినిండా నిద్రకు కరువు తున్నారు. ఇక రైతుల(Farmers) పరిస్థితి చెప్పనవసరం లేదు. ఆరుగాలం శ్రమించి దేశానికే అన్నం పెట్టే రైతన్నలు కరెంట్ కోసం అష్టకష్టాలు పడుతున్నారు. ట్రాన్స్ఫార్మర్లు(Transformer) కాలిపోయి పంటలు ఎం డి పోయినా అధికారులు పట్టించుకోకపోవడంతో రైతులే కాడెడ్లుగా మారిన దుస్థిని పలువురిని కలిచివేసింది.
వివరాల్లోకి వెళ్తే..మహబూబాబాద్(Mahabubabad) జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మరిపెడ మండలం రాంపురం గ్రామంలో ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయాయి. విద్యుత్ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదు. దీంతో ఎండుతున్న పంటలను కాపాడుకోవడం కోసం రైతులు కాడెడ్లుగా మారారు. స్వయంగా ట్రాన్స్ఫార్మర్ని ఎడ్ల బండిపై చేర్చి ఎద్దుల స్థానంలో రైతులే బండిని లాగుతూ ట్రాన్స్ఫార్మర్ని అమర్చారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి విద్యుత్ సమస్యలు తీర్చాలని రైతులు కోరుతున్నారు.
కరెంట్ కోసం కాడెడ్లుగా మారిన రైతులు
భారీ వర్షానికి కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్లు పట్టించుకోని విద్యుత్ అధికారులు.
ఎండుతున్న పంటలను కాపాడుకోవడం కోసం రైతుల అవస్థలు.
మహబూబాబాద్ – గత 15 రోజుల క్రితం కురిసిన వర్షాలకు మరిపెడ మండలం రాంపురం గ్రామంలో కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్లు.… pic.twitter.com/MBB8OF9E2k
— Telugu Scribe (@TeluguScribe) September 18, 2024