హైదరాబాద్ : రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం అమ్ముకోలేక ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ముందుస్తు ప్రణాళిక లేకపోవడమే దీనికి కారణమని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆరోపించారు. మంగళవారం తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడారు. గన్నీ బ్యాగుల ఏర్పాటు చెయ్యడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. 75 సార్లు ఢిల్లీ వెళ్ళేందుకు రేవంత్ రెడ్డికి సమయం ఉందిగాని రైతుల సమస్యల గురించి పట్టించుకునేందుకు రేవంత్ రెడ్డికి సమయం లేదని మండిపడ్డారు.
రైతు బిడ్డను అని పోజులు కొట్టే రేవంత్ రెడ్డి, నకిలీ రైతు బిడ్డ అని ఎద్దేవా చేశారు. వందల కిలోలు ధ్యాన్యానికి7 కిలోలకు పైగా తరుగు తీస్తున్నారు. మక్కలు పండించిన రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. భూపాలపల్లి నియోజకవర్గంలో మక్కలు కొనే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రం మొత్తం ఇలాగే ఉందని మండిపడ్డారు. కేసీఆర్ రైతు బంధావుడు, రైతుల కోసం అనేక కార్యక్రమాలు చేపట్టారన్నారు.
కరోనా లాంటి విపత్కరమైన పరిస్థితి వచ్చినప్పుడే కేసీఆర్ ధ్యానం కొనుగోలు చేశాడని గుర్తు చేశారు. ఎద్దు ఏడ్చిన వ్యవసాయం, రైతు ఏడ్చిన వ్యవసాయం మంచిది కాదని హితవు పలికారు. రైతుల కన్నీళ్లలో రేవంత్ రెడ్డి కొట్టుకుపోక తప్పదన్నారు. ప్రభుత్వం రైతుల కష్టాల పై స్పందించకపోతే రైతులతో కలిసి పోరాటాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.